ప్రజల ఆకాంక్ష అవసరాల కోసం కొట్లాడిన : ఎమ్మెల్యే సీతక్క

by Disha Web Desk 23 |
ప్రజల ఆకాంక్ష అవసరాల కోసం కొట్లాడిన : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, మంగపేట : సోమవారం మండలంలో పర్యటించిన సీతక్క మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.తన 9 ఏండ్ల ఎమ్మెల్యే కాలంలో నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలైన ములుగు జిల్లా సాధన, మల్లంపల్లి మండలం, పోడు రైతులకు పట్టాలు, బిల్ట్ పరిశ్రమ పునరుద్దరణ, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్, ఏటూరునాగారం బస్ డిపోలతో పాటు మంగపేట మండలంలోని రాజుపేటను మండలంగా ఏర్పాటు చేయాలని ప్రతినిత్యం అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్టాడినట్లు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష అవసరాల కోసం నిరంతరం తడ్లడినట్లు ఆమె భావోద్వేగంతో తెలిపారు. నా కుటుంబ స్వార్థంతో ఏనాడు రాజకీయాలు చేయలేదని పార్టీలకు అతీతంగా అన్ని వేళల పని చేయడంతో పాటు అధికార పార్టీ మంత్రులతో కొట్టలాడి నియోజకవర్గంలో సుమారు 2 లక్షల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయించినట్లు తెలిపారు. నేడు అధికారం కోసం ఏనాడు ప్రజల మొఖం తెలియని కొత్త ముఖాలు రోడ్ల పైకి వచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయాలని తిరుగుతున్నారని వారికి ప్రజలే బుద్ది చెబుతారని సీతక్క అన్నారు.

డబ్బు సంచులతో అధికారాన్ని పదవులను కొనాలనే ఆలోచనతో ములుగు జిల్లాలో తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు చూసి నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో ఆపదలో కుటుంబ సభ్యులను పోగొట్టున్న బాదలలో తాను వారికి అండగా ఉన్నానని ఏనాడు వారిని వీడి పట్టణాల్లో ఉండలేదని తెలిపారు. కరోనా వచ్చినా, వరదలొచ్చినా ,వారి కుటుంబాలకు అండగా ఉండాలనే తాపత్రయంతో నిత్యం వారి కష్టసుఖాలకు తోడుగా ఉంటూ గడచిన 9 సంవత్సరాలలో వారి ఆకాంక్షల మేరకు పని చేస్తూ జిల్లాను సాధించాము మల్లంపల్లి మండలాన్ని సాధించాము రాష్ట్రంలో పోడు రైతులకు పట్టాలు సాధించాము, ఏటూరునాగారం డివిజన్ సాధించాము, ఫైర్ స్టేషన్ సాధించామని పునరుద్ఘాటించారు.

5 సంవత్సరాలు తమ డిమాండ్లను పట్టించుకోని బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు నేడు ఎన్నికలు రాగానే ప్రకటించి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అవన్ని ప్రజలు గమనిస్తున్నారని సీతక్క అన్నారు. రాష్ట్రంలో వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వచ్చే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రినయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మండవ రామకృష్ణ దంపతులు తమ అనుచరులతో కలిసి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సమావేశంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, ప్రచార కమిటీ చైర్మన్ పూజరి సురేందర్ బాబు, ఇర్సవడ్ల వెంకన్న, గద్దల నవీన్, నాయకులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, అయ్యోరి యానయ్య, ముత్తినేని ఆదినారాయణ, తూడి భగవాన్ రెడ్డి, బండ జగన్ మోహన్ రెడ్డి, కొంకతి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed