మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్..!

by sudharani |
మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్..!
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జిల్లా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 32 మంది విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. వారిని హుటాహుటినా మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. గత రాత్రి నుంచే విద్యార్ధినిలు అస్వస్థతకు గురికాగా డాక్టర్లను కస్తూర్బా పాఠశాలలోనే వైద్యం అందించారు. అయినప్పటికీ విద్యార్థుల పరిస్థితి మెరుగు పడకపోవడంతో హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంత మంది విద్యార్థినిలు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు.

అయితే ఇప్పటివరకు విద్యార్థినీల తల్లిదండ్రులకు కస్తూర్బా పాఠశాల యాజమాన్యం సమాచారం అందించకపోవడం గమనార్హం. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నప్పటికీ కొన్ని గంటలు గడిస్తే తప్ప విద్యార్థునిల ఆరోగ్య పరిస్థితి, అస్వస్థతకు గల కారణాలు చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. కాగా.. అస్వస్థతకు గల కారణాలు కలుషిత నీరా..? ఆహారమనేది? ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. చికిత్స పొందుతున్న విద్యార్థినీలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Next Story

Most Viewed