దేవరుప్పుల మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత

by Kalyani |   ( Updated:2025-04-14 16:24:23.0  )
దేవరుప్పుల మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, దేవరుప్పుల: భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా దేవరుప్పుల మండల కేంద్రంలోని దళిత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఓ అదృష్టంగా భావిస్తున్నానని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తులకు పేరుపేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అణగారిన వర్గాలకి డా" బి.ఆర్ అంబేద్కర్ ఒక ఆశా కిరణమని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని తెలియజేసారు.

పోలీసుల అత్యుత్సాహం సరి కాదు

మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు విగ్రహ దాతగా ఆహ్వానం మేరకు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీసుల బందోబస్తు ఏంటని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కే అవమానపరిచేలా స్థానిక పోలీసుల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదేశానుసారం పోలీసులు ఏక పక్షంగా విగ్రహ ఆవిష్కరణకు రాకుండా అడ్డుపడడం సరికాదని వారి తీరుపై మండిపడ్డారు. రానున్న రోజుల్లో మళ్ళీ తిరిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలుస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు భాషి పాక యాదగిరి, చింత యాదగిరి, జోగు సోమనర్సయ్య, బాషిపాక అబ్బయ్య, ఎల్లెష్ , పరశురాములు, సంజీవ, నాయకులు పల్ల సుందర్ రాంరెడ్డి, తీగల దయాకర్ గౌడ్, ఏల సోమసుందర్, బస్వ మల్లేశం, చింత రవి, ప్రవీణ్ ,విజయ్, రామోజీ, రంగయ్య, యాదగిరి, దళిత సంఘాల నాయకులు , బీఆర్ఎస్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed