బెల్ట్‌షాప్‌పై ఆబ్కారి ఎస్సై రైడ్

by Dishaweb |
బెల్ట్‌షాప్‌పై ఆబ్కారి ఎస్సై రైడ్
X

దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం కేంద్రంలోని తాడిచర్ల ఓ ప్రజాప్రతినిధి వార్డు సభ్యుడు నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ పై మంగళవారం కాటారం ఆప్కారి ఎస్సై గంగాధర్ రైడ్ చేసిన విషయం గోప్యంగా ఉంచారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మద్యం కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తాడిచర్ల బ్రాందీ షాప్ నిర్వాహకుల సమాచారంతో రూ.5 వేలు విలువ చేసే బ్రాందిని స్వాధీనం చేసుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. బెల్ట్ షాపులు ఎన్ని ఉన్న.. స్థానిక బ్రాండీ షాపులోనే కొనుగోలు చేస్తూ గ్రామాల్లో విక్రయించాలని ఎక్సైజ్ అధికారుల హుకుం. ఐన కొందరు బెల్టు నిర్వాహకులు నాన్ లోకల్ బ్రాందీతో జీరో తందా సృష్టించి అధిక మొత్తంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్న విషయం అందరికీ తెలిసిందే.

బ్రాందీ షాప్ యజమానుల అమ్మమ్యాలకు అలవాటు పడి ఆప్కారి శాఖ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తూ బ్రాందీ షాప్ యజమానుల ఫిర్యాదుపై స్పందించి ఒక్క బెల్ట్ షాప్ పైనే రైడ్ చేయడం ఎక్సైజ్ అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఓసిపి కోల్ మైనింగ్ ప్రాంతం తాడిచెర్లలో గల్లికో బెల్ట్ షాపులు వెలిసి బొగ్గు మైనింగ్ కార్మికులకు, స్థానిక మందు ప్రియులకు దర్జాగా అమ్మకాలు సాగిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడం గమనర్హం. బ్రాండ్ షాప్ యజమానులు సిండికేట్లుగా ఏర్పడి బెల్ట్ షాప్ నిర్వాహకులకు బ్రాండ్ మందు అధిక రేట్లకు విక్రయించి బ్రాందీ షాప్ లో మాత్రం బ్రాండ్ మందు లభించకపోవడం వల్ల మందు ప్రియులు ఇటీవల కొయ్యూరు బ్రాందీ షాప్ యజమానులపై దాడులకు తెగబడ్డారు. దీంతో రంగ ప్రవేశమైన పోలీసులు కేసులు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించడం కొసమెరుపు.


Next Story