విద్యుత్ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు

by Dishafeatures2 |
విద్యుత్ విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
X

దిశ, హనుమకొండ టౌన్: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. విద్యుత్ చౌర్యానికి పాలుపడుతున్న 215 మంది పై కేసులు నమోదు చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో డీఈ సామ్యా నాయక్ ఆధ్వర్యంలో ఆపరేషన్ హనుమకొండ పేరుతో 25 విద్యుత్ విజిలెన్స్ అధికారుల బృందాలు 16 గ్రామాలల్లో దాడులు చేశాయి. ఎస్సీ కాలనీలలో దాడులు చేయడంతో 579 సర్వీసులకు గానూ 215 మీటర్లు లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని డీఈ తెలిపారు. 19 మంది కొత్తగా మీటర్లను తీసుకునేందుకు ముందుకు వచ్చారని, వారికి విద్యుత్ అధికారులు సహకరిస్తారని అన్నారు.

మీటర్లు లేనివారందరూ వెంటనే మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలని, 101 యూనిట్ వరకు వాడుకునేందుకు ఉచితంగా అందచేస్తామని అన్నారు. తరచూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వెంటనే మీటర్లకు డబ్బులు కట్టుకుంటే కొత్త మీటర్లు అందచేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ ఆకస్మిక దాడుల్లో విజిలెన్స్ అధికారులు దేవేందర్ నాయక్, దానయ్య, గంగారెడ్డి, జానకి రామ్ రెడ్డి, రాజు, అశోక్, విజిలెన్స్ ఏఈ లు , ఆత్మకూరు మండల ఏఈ రవికుమార్, ఇతర మండలాల ఏఈ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed