జడ్పీ చైర్మన్‌కు నిరసన సెగ... బతుకమ్మ చీరలు వద్దేవద్దంటూ చుక్కలు చూపించిన మహిళలు

by Dishanational1 |
జడ్పీ చైర్మన్‌కు నిరసన సెగ... బతుకమ్మ చీరలు వద్దేవద్దంటూ చుక్కలు చూపించిన మహిళలు
X

దిశ, ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి బతుకమ్మ చీరలు మాకొద్దు అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ని నిలదీసిన స్థానిక మహిళలు ఈ చీరలు తమకు వద్దంటూ చీరలకు బదులుగా తమ గ్రామానికి నిధులు కావాలని జడ్పీ చైర్మన్ ను నిలదీసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ చీరల పంపిణీ కార్యక్రమం ఆపివేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను జడ్పీ చైర్మన్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సర్పంచ్ నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, గ్రామ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story