ఆలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తా: MLA పెద్ది హామీ

by Disha Web |
ఆలయ అభివృద్ధి కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తా: MLA పెద్ది హామీ
X

దిశ, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని మేడపల్లి శివారు లక్ష్మీ తండాలో మంగళవారం దుర్గమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజుల్లో తండా వాసులు భక్తి ప్రవత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పరిసర గ్రామ ప్రజలు హాజరయ్యారు. కాగా, దుర్గామాత విగ్రహాన్ని నాంపల్లి సౌజన్య రాజశేఖర్ దంపతులు బహూకరించారు. అట్టహాసంగా జరిగిన ఈ దుర్గమ్మ వేడుకలకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భూక్య సాయన్న, సర్పంచ్ తిరుపతి, నునావత్ రాజు, అజ్మీర బాసు, మాలోతు బీక్య, బిచ్య, వీరన్న, జవహర్ పాల్గొన్నారు.


Next Story