కాంగ్రెస్‌లోకి డాక్టర్ కృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

by Disha Web Desk 19 |
కాంగ్రెస్‌లోకి డాక్టర్ కృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన TPCC చీఫ్ రేవంత్ రెడ్డి
X

దిశ, జనగామ: జనగామ పట్టణానికి చెందిన డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం హైదరాబాదులో ఆయన కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. యువకుడిగా మంచి పేరు ఉండడంతో ఆయన రాకను పలువురు యువజన సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈయన స్వగ్రామం రఘునాథపల్లి మండలంలోని కోమల గ్రామం కాగా, గత కొన్నాళ్లుగా ఈయన పట్టణంలోని ఎస్.ఎస్.కే హాస్పిటల్‌ను నిర్వహిస్తూనే, పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో స్టేషన్గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఈయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ కాంగ్రెస్‌లో చేరడంతో పట్టణంలో ఆసక్తికర చర్చ మొదలైంది.

Next Story