రోడ్డు ఆక్రమిస్తుంటే పట్టించుకోరా: వేముల సాంబయ్య

by Disha Web Desk 11 |
రోడ్డు ఆక్రమిస్తుంటే పట్టించుకోరా: వేముల సాంబయ్య
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ వ్యక్తులు రోడ్డును ఆక్రమించి సైడ్ కాలువ సైతం నిర్మిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ఆరోపించారు. నర్సంపేట పట్టణంలోని కాకతీయ కళాశాలకు వెళ్లే దారిలో బాలికల వసతిగృహం, పశువుల వైద్యశాలకు ఎదురుగా ఖాళీ స్థలం ఉంది. ఇందులో రియల్ ఎస్టేట్ చేసే క్రమంలో కొంతమంది రియల్డర్లు రోడ్డును ఆక్రమించి డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు వేముల సాంబయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లతో కలిసి సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

60 ఫీట్ల రోడ్డు 40 ఫీట్లుగా చిత్రీకరించారు..!

గతంలో 60 ఫీట్ల రోడ్డుగా ఉన్న దానిని మున్సిపాలిటీ నియమాలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులు 40 ఫీట్ల రోడ్డుగా చిత్రీకరించి డ్రైనేజీ కోసం సైడ్ కాలువ నిర్మాణం చేస్తున్నట్లు వేముల సాంబయ్య ఆరోపించారు. ఈ అక్రమం ద్వారా దాదాపు 250 ఫీట్ల పొడువు, 8 అడుగుల వెడల్పుతో మొత్తం దాదాపు 400 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమిస్తూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారని తెలిపారు. భవిష్యత్తులో ప్లాట్లు కొనేవారికి సెట్ బ్యాక్ అవసరం లేకుండా ఉండే విధంగా నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు ఎంత మాత్రం అడ్డుకోవడం లేదన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కోరుతూ నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుల బృందం వినతిపత్రం అందజేశారు. తొలగించని యెడల కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎలకంటి విజయకుమార్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల సారంగం గౌడ్, పంబి వంశీ, లక్కాసు రమేష్, శ్రీ రామోజు మురళి, చిప్ప నాగ, ఓర్స్ వెంకన్న, కటారి ఉత్తంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed