ఓరుగల్లు కోటకు చెందిన అనిల్‌కి డాక్టరేట్

by Disha Web Desk 23 |
ఓరుగల్లు కోటకు చెందిన అనిల్‌కి  డాక్టరేట్
X

దిశ, ఖిలా వరంగల్ : కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం నుంచి ఓరుగల్లు కోటకు కు చెందిన అనుమాసు అనిల్ కు డాక్టరేట్ ప్రకటించారు. ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్ కన్జ్యూమర్ బిహేవియర్ - ఏ స్టడీ ఆన్ ఎఫ్ఎంసీజీ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంధానికి అనిల్ కుమారు కు డాక్టరేట్ ప్రధానం చేశారు. సికెఎమ్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రొఫెసర్ డా"జి.శశిధర్ రావు పర్యవేక్షణలో అనిల్ తన పరిశోధన పూర్తి చేశారు.అనిల్ ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లలో 12 వరకు పరిశోధన పత్రాలు సమర్పించారు. ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన అనుమాసు చంద్రకళ-సత్యనారాయణ కు రెండో సంతానం అయిన అనిల్ ప్రస్తుతం పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.Next Story

Most Viewed