తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం.. నెలవారి ప్రణాళిక ప్రకటించిన జిల్లా ఎస్పీ..

by Disha Web Desk 20 |
తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం.. నెలవారి ప్రణాళిక ప్రకటించిన జిల్లా ఎస్పీ..
X

దిశ, ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అవుతున్నందున దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా జూన్ 2 నుండి జూన్ 22 వరకు అనేక కార్యక్రమాలకు ప్రణాళికను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం రూపొందించారు. ఇందులో భాగంగా బ్లూ కోల్ట్, 100 డయల్ వంటి అత్యవసర సేవల పై ప్రజలకు అవగాహన కలిగించేలా పోలీస్ డిపార్ట్మెంట్ చే ర్యాలీ నిర్వహించుట. పోలీస్ అధికారులు, సిబ్బంది చే ఉచిత రక్తదాన శిబిరం. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం. అధికారులు సిబ్బంది, ట్రైబల్ యువతకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం, డ్రగ్స్ వంటి వాటి వల్ల కలిగే నష్టాలు యువతకు తెలియజేయుటం.

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్ లో భాగంగా యువతకు ఆయుధాల ప్రదర్శన, పోలీస్ విధులు తెలియజేయటం. ప్రకృతి విపత్తు వరదలు సంభవించినప్పుడు పోలీస్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను ఎలా కాపాడారో ప్రజలకు తెలియజేయటం. మహిళల భద్రత కై షీటీం విధివిధానాలను, సేవలను ఎలా ఉపయోగించుకోవాలో బాలికలకు, మహిళలకు తెలియజేయుట వంటి అనేక కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్ కుమార్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీడీసీఆర్బీ సుభాష్ బాబు, డీఎస్పీ ములుగు రవీందర్, సీఐ స్పెషల్ బ్రాంచ్ శ్రీనివాస్, ఆర్ఐ అడ్మిన్ వెంకటనారాయణ, సీఐ ములుగు రంజిత్ కుమార్, సీఐసీసీఎస్ రవీందర్, ఆర్ఐ ఆపరేషన్ కిరణ్, ఎస్ఐ ములుగు పవన్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed