- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ, ఎఫెక్ట్ : మీ సేవ నిర్వహకులకు తహసీల్దార్ కౌన్సిలింగ్..

దిశ, ఏటూరునాగారం: శనివారం రోజున ‘దిశ’ సంచికలో ప్రచురితమైన మీ సేవలో ఆదనపు వసూళ్లు అనే కథనం కు అధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం రోజున ఏటూరునాగారం మండల తహసీల్దార్ జగదీశ్వర్, డిప్యూటి తహసీల్దార్ రాహూల్ వర్మ మీ సేవ నిర్వహకులను పిలిపించి తహసీల్దార్ కార్యలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. దరఖాస్తుల దారుల నుండి అదనపు వసూళ్లుకు పాల్పడుతున్న మీ సేవ నిర్వహకుల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లడుతూ.. ప్రతి మీ సేవలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందని ఏవరైన మీ సేవ నిర్వహకులు అదనపు వసూళ్లకు పాల్పడిన, దరఖాస్తు దారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోక పోయిన టోల్‌ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు. అటువంటి మీ సేవ నిర్వహకుల పై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.