- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేడారానికి పోటెత్తిన భక్తులు

దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఆదివాసీ కుంభమేళాగా పిలవబడే మేడారం మహా జాతర మరుసటి సంవత్సరం నిర్వహించే సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ఈనెల 12 నుండి 15 వరకు జరగనున్న నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించడానికి భక్తులు అధిక సంఖ్యలో మేడారం బాట పట్టారు. ఉదయం నుండి మేడారం వెళ్లే రహదారులు వాహనాల రద్దీతో కనిపించగా భక్తులు ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మను దర్శించుకుని, అనంతరం మేడారం చేరుకొని జంపన్న వాగులో కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించారు.
పసుపు, కుంకుమ, చీర, సారే, ముడుపులు, ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెలకు చేరుకున్నారు. ఆదివారం ఎక్కువ సంఖ్యలో భక్తులు చేయడంతో క్యూలైన్ల ద్వారా భక్తులు అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం మేడారం పరిసర ప్రాంతాలలో ఉన్న చెట్ల కిందకు చేరుకొని వనభోజనాలు చేసి సాయంత్రం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదివారం ఒక్కరోజే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు తెలుస్తోంది.