దేవాలయంలో విగ్రహాల ధ్వంసం.. వరుస సంఘటనలతో గ్రామస్తుల ఆందోళన

by Aamani |
దేవాలయంలో విగ్రహాల ధ్వంసం.. వరుస సంఘటనలతో గ్రామస్తుల ఆందోళన
X

దిశ,కమలాపూర్: వరుసగా మండలంలోని దేవాలయలలో విగ్రహాల చోరీలు, విగ్రహాల ధ్వంసం స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాల ధ్వంసానికి పూనుకున్నారు. గ్రామంలోని మడల్లేశ్వర దేవాలయంలో ఉన్న విగ్రహాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గతంలో అంబాల వాగు సమీపంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం, శనిగరం గ్రామంలో పంచలోహ విగ్రహాల చోరీ ప్రస్తుతం శనిగరం గ్రామంలో విగ్రహాల ధ్వంసం చేయడంతో మండలంలో ఎవరు చేస్తున్నారో తెలియక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ వరుస చోరీలు పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికైనా పోలీసులు ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలు రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story