నూతన పద్ధతిలో పంటల సాగు చేయాలి : జిల్లా కలెక్టర్

by Aamani |
నూతన పద్ధతిలో పంటల సాగు చేయాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,హనుమకొండ టౌన్ : రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని , సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని , నూతన పద్ధతలల్లో పంటల సాగు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతులను కోరారు. మంగళవారం పలివేల్పుల గ్రామం, హనుమకొండ మండలం లో గల రైతు వేదిక నుంచి మాట్లాడుతూ, రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలు క్షేత్ర స్థాయిలో రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా రైతులను వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారి గా అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించారు. రైతు నేస్తం దృశ్య శ్రవణ మాధ్యమం లో హైదరాబాదు నుండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ నుంచి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుండి సంచాలకులు గోపి , వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలైన ప్రశాంత్ హాజరు అయ్యారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అధిక సేంద్రియ లో ప్రత్తి పంట సాగు గూర్చి , శాస్త్రవేత్తల సలహాలు అందిస్తూ అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా ఇతర రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 50 వేల నుంచి 60 వేల మొక్కలు సాగు చేసినట్లయితే అధికంగా దిగుబడులు సాధించవచ్చు అన్నారు. సేంద్రియ వ్యవసాయం పై పద్మ శ్రీ. చింతల వెంకట్ రెడ్డి తమ అనుభవాలను రైతులకు నేరుగా వివరిస్తూ చీడ పీడలను తట్టుకొనే పలు రకాల ద్రవణాల గూర్చి వివరించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు దామోదర రెడ్డి మాట్లాడుతూ రైతులు సరియిన విత్తనాలను కొనుగోలు చేయాలని , అన్ని రకాల విత్తనాలు మార్కెట్ లో లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద ఉన్నాయని, విత్తన కొరత లేదని పత్తి పండించే రైతులు అధిక సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేయాలని అన్నారు. ఈ రైతు నేస్తం కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, మండల వ్యవసాయ శాఖ అధికారులు , వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed