ఏప్రిల్ 16న సీపీఎస్ కాంస్టిట్యూషనల్ మార్చ్..

by Sumithra |
ఏప్రిల్ 16న సీపీఎస్ కాంస్టిట్యూషనల్ మార్చ్..
X

దిశ, వరంగల్ కలెక్టరేట్ : రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాల సీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న కాంస్టిట్యూషనల్ మార్చ్ నిర్వహించనున్నామని, దానిని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా టీఎస్ సీపీఎస్ ఈయూ డిపార్ట్మెంట్ ఫోరం కన్వీనర్ దొడ్డి పాటి హారికుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓల్డ్ పెన్షన్ సాదనే లక్ష్యంగా బైక్ ర్యాలీ, పాద యాత్ర ఉంటుందని తెలిపారు. పాతపెన్షన్ ప్రతిఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఓపీఎస్ సాధనకోసం ప్రతి సీపీఎస్ ఉద్యోగి ఈ ర్యాలీలో పెద్దయెత్తున పాల్గొనాలని అన్నారు.

సీపీఎస్ మిత్రులతో పాటు అన్నిసంఘాల మద్దతు కోరుతున్నామన్నారు. ఈ కాంస్టిట్యూషనల్ మార్చ్ ఏప్రిల్ 16న ఎంజీఎం జంక్షన్ నుండి ఉ.8.00 గంటలకు ప్రారంభమై హన్మకొండ ఏకశిల పార్క్ వరకు బైక్ ర్యాలీగా చేరుకొని, అక్కడి నుండి ఉదయం 8:30 లకు పాదయాత్ర గా వరంగల్ కలెక్టరేట్, హన్మకొండ కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్ లకు వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ జిల్లా అద్యక్షులు కందుల జీవన్, జనరల్ సెక్రెటరీ కొండ శ్రీనివాస్ షేక్ అఫ్జల్ మునిసిపల్ జాక్ అద్యక్షులు గౌరి శంకర్, ధర్మరాజు, బొట్ల రమేష్, సుష్మిత, రెడ్డి రజిత, జాన్సి, స్వప్న, దివ్య, జ్యోతి, మేకల మానస తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed