రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా..

by Sumithra |
రెసిడెన్షియల్ పాఠశాలలో కరోనా..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు బుధవారం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజుల నుండి విద్యార్థులలో దగ్గు, జలుబు, జ్వరం వస్తుండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చింది. సుమారు 62 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్ లు చేయగా వీరి లో 8, 9 తరగతి విద్యార్థులకు 9మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్ పాఠశాల చేరుకొని విద్యార్థులకు, ఉపాద్యాయులకు తగు సూచనలు చేశారు.

Next Story