కానిస్టేబుల్ రాజు మృతదేహం లభ్యం

by Disha Web |
కానిస్టేబుల్ రాజు మృతదేహం లభ్యం
X

దిశ, హనుమకొండ టౌన్: శాయంపేట మండలంలోని జోగంపల్లి కొప్పుల గ్రామాల మధ్య గల ప్రాజెక్ట్ వాగులో దామెర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ చెన్న రాజు మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనం అదుపుతప్పి వాగులో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా జోగంపల్లి చలి వాగు ప్రాజెక్ట్ లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండురోజుల ఉత్కంఠ చివరికి విషాదంగా మిగిలింది. గురువారం మధ్యాహ్నం కొప్పుల శివారులోని చలి వాగులో రాజు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కుటుంబ సభ్యులతోపాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో విషాదాన్ని నింపింది.

Next Story

Most Viewed