నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ గ్ర‌హీత‌కు అభినంద‌న‌లు..

by Sumithra |
నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ గ్ర‌హీత‌కు అభినంద‌న‌లు..
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : నో క్యాస్ట్.. నో రిలీజియన్ సర్టిఫికెట్ తీసుకొన్న జై బోర‌న్న‌ నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ను ప్రజాచైతన్య సంఘం ప్రెసిడెంట్ సీహెచ్ శోభారాణి ఆదివారం వ‌రంగ‌ల్‌లో విడుద‌ల చేసిన‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో అభినందించారు. కమ్యూనిస్టు విప్లవకారుడు, జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత, ప్రజాబంధువుగా పిలవబడే కామ్రేడ్ జైబోరన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం తమకు ఇక పై ఏ కులంతో గాని, ఏ మతంతో గాని సంబంధం లేదని పేర్కొంటూ నో క్యాస్ట్... నో రిలీజియన్ సర్టిఫికెట్ తీసుకోవ‌డాన్ని శోభారాణి అభినందించారు.

సామాజిక మార్పును కాంక్షించే ప్రజాతంత్ర శక్తులకు జేఎస్ఆర్ ఆదర్శంగా నిలిచాడనీ ఆమె కొనియాడారు. మూడు దశాబ్దాలుగా నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణానికి తనవంతుగా కృషి చేస్తున్న ఆదర్శ విప్లవకారుడంటూ పేర్కొన్నారు. సుభాష్ చంద్ర‌బోస్ కూతురు ఝాన్సీ లక్ష్మీబాయి, పెద్ద కొడుకు మహాత్మా గాంధీజీ, చిన్నకొడుకు సర్దార్ పటేల్ కు ఏ కులం, ఏ మతంతో సంబంధం లేదని పేర్కొంటూ 'నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొన్న‌ట్లు తెలిపారు. కులం, మతం ప్రస్తావనలేని సమాజం కావాలని కలలుగంటున్న తనలాంటి ఎందరో సామాజిక కార్యకర్తలకు సుభాష్ జీవితం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Next Story