పూర్తయిన న్యాక్ బృందం మూడు రోజుల పర్యటన..

by Disha Web Desk 20 |
పూర్తయిన న్యాక్ బృందం మూడు రోజుల పర్యటన..
X

దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల న్యాక్ బృందం పర్యటన పూర్తయిన సందర్భంగా పీర్ టీం చైర్మన్ ఆచార్య సుగం ఆనంద్ విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో నిర్వహించిన ఎగ్జిట్ మీటింగ్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ కు రిపోర్ట్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పూర్వవిద్యార్థుల సమ్మేళనం కలిగిన యూనివర్సిటీల్లో కాకతీయ యూనివర్సిటీ ఒక్కటీ అని, ఉన్నత విద్యలో విస్తృతమైన మార్పులు రాబోతున్న తరుణంలో విశ్వవిద్యాలయల పాత్ర చాలా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ప్రయివేటీకరణ పెద్దఎత్తున జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయం మనుగడ సాదించాలంటే మన సేవలను, బలాలను బహిరంగ పరచాలన్నారు. మూడవ రోజున కాకతీయ విశ్వవిద్యాలయ వివిధ విభాగాలతో పాటు కామన్ ఫెసిలిటీస్, ఇతర వసతులు పరిశీలించారు. విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం.. ఎగ్జిట్ మీటింగ్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ పీర్ టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక పై పీర్ టీం సభ్యులు, రిజిస్ట్రార్ ఆచార్య శ్రీనివాస రావు, ఐక్యూ ఏసీ డైరెక్టర్ ఆచార్య ఎస్.నరసింహ చారి పాల్గొన్నారు.


Next Story