రైతులకు బిగ్ అలర్ట్.. ఆ రకం వరి సాగు చేయవద్దని కలెక్టర్ ఆదేశాలు

by Mahesh |
రైతులకు బిగ్ అలర్ట్.. ఆ రకం వరి సాగు చేయవద్దని కలెక్టర్ ఆదేశాలు
X

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా 2023 – 24 ఖరీఫ్ పంట కాలంలో వరి రకం 1001 రైతులు సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ కె .శశాంక్ జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనికి కారణం.. 001 వరి దొడ్డు రకం వలన రా రైస్ క్వింటాకు 70 శాతం రావడం లేదని జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం వాపోతున్నారు. అలాగే.. దీని వలన తాము తీవ్రంగా నష్ట పోతున్నట్లు రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమీక్షించిన కలెక్టర్.. వరి రకం 1001 ను సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఈనెల 12 స్పష్టమైన అదేశాలలో జిల్లాలో వ్యవసాయ అధికారుల ద్వారా గ్రామాల్లో 1001 వరి రకం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విత్తన షాపుల్లో వరి 1001 రకం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం .1001 రకంపై రైతులు ఎక్కువ మక్కువ చూపడం పరిపాటిగా మారింది . సన్న, చిన్న, మధ్య తరగతి రైతులు సన్న రకం వరి ధాన్యం సాగుతో ఎక్కువ పెట్టుబడితో తక్కువ దిగుబడి వచ్చి నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఈ రకం సాగు పై నిషేధం విధిస్తే కౌలు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉందని రైతులు ద్వారా తెలుస్తుంది.

Next Story

Most Viewed