- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
ముదిరాజ్‌ల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ : ఎర్రబెల్లి

దిశ,తొర్రూరు : ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, సీఎం కేసీఆర్ సహకారంతో భవిష్యత్తులో మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.సోమవారం డివిజన్ కేంద్రంలోని ఎల్ వై ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ బండా ప్రకాష్ లు పాల్గొన్నారు.
ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తూరు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనంలో దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణలో మత్స్యకారుల సంఘం లో నాలుగున్నర లక్షల మందికి సభ్యత్వం నమోదైందని, ఇంకా 2 లక్షల మందికి సభ్యత్వం ఇప్పించే అవకాశం ఉందన్నారు. ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్‌కు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని, ముదిరాజ్‌లకు తెలంగాణ ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్‌ఎస్ సర్కారు వైపే ముదిరాజ్‌లు ఉన్నారని, సీఎం కేసీఆర్ పాలనను మరోసారి కోరుకుంటున్నారన్నారు.
విపక్షాల మాటలు నమ్మి ఆగం కావద్దని ఆలోచించి ఓటు వేయాలని కోరారు.పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపానని, ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయాలని కోరారు.ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదిగే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సొసైటీలు, మత్స్యశాఖల ద్వారా అధికారాన్ని కట్టబెట్టినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో 5 ఎకరాల్లో ముదిరాజ్ భవన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు.స్వాతంత్య్రానంతరం ఏ ఒక్క ముఖ్యమంత్రి ముదిరాజ్‌లను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక ముదిరాజ్‌ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు,కుంటలు నింపి ఉచితంగా రొయ్యలు, చేపలను వదిలి మత్స్యకారులందరినీ ఆదుకున్నారని తెలిపారు. ముదిరాజులు ఒక్కసారి మాట ఇస్తే తప్పరని,ఎర్రబెల్లి దయాకర్ రావును భారీ మెజారిటీతో గెలిపించేందుకు ముదిరాజులు సహకారం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ పాలకుర్తి కన్వీనర్ చిక్కుడు రాములు, అధ్యక్షుడు మాచర్ల ఎల్లయ్య, మహాసభ వరంగల్ అధ్యక్షుడు చొప్పరి సోమయ్య, యూత్ నాయకులు శోభన్, కార్యదర్శులు గంధం చంద్ర మూర్తి,సాధు రాములు, దేవరుప్పుల మండల అధ్యక్షుడు సోమశేఖర్, రాయపర్తి మండల అధ్యక్షుడు కాశీ నాదం, పెద్ద వంగర మండల అధ్యక్షుడు దయాకర్, కొడకండ్ల మండల అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.