వెహికల్ నెంబర్ మార్చి తిరుగుతున్న వ్యక్తిపై చీటింగ్ కేసు..

by Disha Web Desk 7 |
వెహికల్ నెంబర్ మార్చి తిరుగుతున్న వ్యక్తిపై చీటింగ్ కేసు..
X

దిశ, కరీమాబాద్ : వరంగల్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ బాబులాల్ అధ్వర్యంలో శుక్రవారం కాశీబుగ్గ జంక్షన్‌లో ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్, కానిస్టేబుల్స్ భాస్కర్ రెడ్డి, అజయ్, ఆసిఫ్‌లు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గీసుకొండ మండలం మోగిలిచేర్ల గ్రామానికి చెందిన పుచ్చ కుమారస్వామి అనే వ్యక్తి ఉద్దేశ పూర్వకంగా తన మోటార్ వెహికల్ ముందర నంబర్ ప్లేట్ తొలగించి, వెనక నంబర్ ప్లేట్ మీద AP36M4005 నంబర్‌కి బదులుగా AP36M1005 గా మార్చి తిరుగుతున్నాడు. ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతనిపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 420 ఐపీసీ చీటింగ్ కింద కేసు నమోదు చేశారు.



Next Story