అక్ర‌మంగా ప‌శువుల‌ను త‌ర‌లిస్తున్న బోలేరోలు సీజ్

by Sumithra |
అక్ర‌మంగా ప‌శువుల‌ను త‌ర‌లిస్తున్న బోలేరోలు సీజ్
X

దిశ‌, ఏటూరునాగారం : ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌కుండా అక్ర‌మంగా ప‌శువుల‌ను 5 బోలేరో గూడ్స్ వాహ‌నంలో త‌ర‌లిస్తున్న 10 మందిని తాడ్వాయి పోలీసులు ప‌ట్టుకుని వారి పై కేసులు న‌మోదు చేశారు. తాడ్వాయి ఎస్సై శ్రీ‌కాంత్ రెడ్డి క‌థ‌నం మేర‌కు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల మండ‌లం నుండి కొంత మంది ఎలాంటి నిబంధన‌లు పాటించ‌కుండా ప‌శువుల‌ను బోలేరో వాహ‌నాల‌లో త‌ర‌లిస్తున్నార‌నే న‌మ్మ‌ద‌గిన స‌మాచారం వచ్చిందన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం అర్ద‌రాత్రి తాడ్వాయి జాతీయ ర‌హ‌దారి పై త‌నిఖీలు చేపట్ట‌ామన్నారు. ఈ త‌నిఖీల‌లో చ‌ర్ల ప్రాంతం నుండి 5 బోలేరో వాహ‌నాల‌లో 69 ప‌శువుల‌ను త‌ర‌లిస్తున్న 10 మందిని ప‌ట్టుకుని 5 బోలేరో వాహ‌నాల‌ను సీజ్ చేశామని ఎస్సై శ్రీ‌కాంత్ రెడ్డి తెలిపారు. కాగా ప‌ట్టుబ‌డిన 10 మంది పై కేసు న‌మోదు చేసి ప‌శువుల‌ను గోశాల‌కు త‌ర‌లించామన్నారు.



Next Story

Most Viewed