ఎంజీఎం జంక్షన్ లో తప్పిన పెను ప్రమాదం

by Disha Web |
ఎంజీఎం జంక్షన్ లో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, హనుమకొండ టౌన్ : ఎంజీఎం జంక్షన్ లో పెను ప్రమాదం తప్పింది. సిగ్నల్ స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో వాహనదారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరంగల్ నగరంలోని ఎంజీఎం జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఉన్న ఇనుప స్తంభం తుప్పు పట్టిపోవడంతో విరిగి నడిరోడ్డు పై పడింది. ప్రతి విషయానికి హడావిడి చేసే పోలీసులు తుప్పు పట్టిన స్తంభాల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Next Story