- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్.. స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ ఉద్రిక్తత
ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

దిశ, ధర్మసాగర్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజయ్య నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి బయటకు రాకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ అనంతరం స్పందించిన డాక్టర్ రాజయ్య, స్టేషన్ ఘనపూర్‌లో డిప్యూటీ సీఎం పర్యటనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రెండున్నర సంవత్సరాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఘనపూర్ గడ్డపై అడుగుపెడుతోందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన సబ్‌స్టేషన్లను ఇప్పుడు ప్రారంభిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. రైతులకు ఉపయోగపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు.ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డాక్టర్ రాజయ్య డిమాండ్ చేశారు.






