కొడుకులున్న అనాథలం.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల నిరసన

by Disha Web Desk 23 |
కొడుకులున్న అనాథలం.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల నిరసన
X

దిశ, చిట్యాల : మండల కేంద్రం శివారులో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య వరలక్ష్మి అనే వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తాను సంపాదించిన ఆస్తి వ్యవసాయ భూమిని గత కొన్ని ఏళ్ల క్రితం పెద్ద కొడుకు 20 గుంటలు ఎక్కువగా, మిగతా ఇద్దరు కొడుకులకు సమాన వాటాలుగా కూతురుకు ఒక ఎకరం భూమిని పంచి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్దకొడుకు క్యాతం రమేష్,చిన్న కొడుకు క్యాతం సతీష్ లు ఇద్దరు మమ్మల్ని హింసిస్తూ వేధిస్తూ మానసిక క్షోభ గురి చేస్తున్నారంటూ ఆ వృద్ధ దంపతులు ఆ గ్రామంలో ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లు వేశారు. ఎక్కడికి పోయినా కూడా మాకు న్యాయం జరుగుట లేదంటూ పురుగుల మందు డబ్బా పట్టుకొని అధికారులు మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.

వృద్ధ దంపతులు మాట్లాడుతూ...

వృద్ధులైన మేము గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ భూమిని చేస్తున్న పంటలు పండక పోవడంతో పాటు, పాత ఇల్లు కూలిపోయే దశలో ఉండగా, కొత్త ఇల్లు నిర్మించుకున్నాము. దీంతో కొన్ని అప్పులు కాగా వ్యవసాయంలో ఆశించినంత మేరకు పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో నేను నా కొడుకులను పెద్ద మనుషుల దగ్గరికి పలుమార్లు పిలిపించి నా పేరు మీద ఉన్న నా పట్టా భూమిలోని 20 గుంటలు భూమిని అమ్మి అప్పిచ్చిన వారికి కడదామంటే నా పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సతీష్ లు నన్ను నానా బూతులు తిడుతూ భూమిని అమ్మనీయకుండా అడ్డుపడుతున్నారు. అప్పులు ఇచ్చినవారు ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో నేను ఎక్కడికి వెళ్లినా నా బాధను చెప్పుకున్న కూడా నాకు న్యాయం జరగడం లేదు. వృద్ధుల మైన మాకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా బాధను చెప్పుకున్న కూడా మాకు న్యాయం జరగకపోగా నా ఇద్దరు కొడుకులు మా మీదనే ఉల్టా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పురుగుల మందు డబ్బా పట్టుకొని మా బాధను అర్థం చేసుకోవాలని మాకు న్యాయం కావాలంటూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ స్పందించాలంటూ తమ గోడును వెల్లబోసుకున్నారు.

ఫోన్లో పెద్ద కొడుకు క్యాతం రమేష్ ను సంప్రదించగా..

మా అమ్మానాన్నలు వృధా ఖర్చులు, అప్పులు చేసిన డబ్బులను మేము కట్టినాం. వాళ్ల పేరు మీద 4 ఎకరాల 17 గుంటల భూమి ఉంది వాటి మీద రైతుబంధు డబ్బులు వస్తాయని, ఇంకా అప్పులు ఎలా అవుతాయని మేము అప్పులు కట్టిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని అంటున్నాడు.

Next Story