- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పదేళ్లలో వినతులను పంపించడంలో నేనే ముందున్నా..: జనగామ ఎమ్మెల్యే
దిశ,జనగామ : టీఎన్జీవో భవన నిర్మాణానికి సీడీపీ నిధులు లేదా వ్యక్తిగతంగా నిధులు ఇస్తానని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న టీఎన్జీవో భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి కాన్వెంక్షన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొని మాట్లాడారు. 17 వేల వీఆర్వోలు, 11 వేల కాంట్రాక్ట్ లెక్చరర్ లను పర్మినెంట్ చేయడంలోనూ నేనే ముందుండి కేసీఆర్ తో చేయించానని, టీఎన్జీవోలు నా దగ్గరకు వస్తే కేసీఆర్ తో కలిపించి మాట్లాడించేవాడిని, తెలంగాణ తొలి దశ పోరాటంలో టీఎన్జీవోలే కీలకంగా ఉన్నారు. మలిదశ పోరాటంలోనూ కీలకంగా ఉన్నారు.పదేళ్లలో టీఎన్జీవో ల సమస్యలను పరిష్కరించడంలో ముందున్న,తెలంగాణ ఏర్పాటులో కూడా టీఎన్జీవోలు ముందున్నారు. ఉద్యోగులు కోరుకుంటున్న నాలుగు డీఏలు, కొత్త పీఆర్సీ, పెండింగ్ లో ఉన్న టీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పోరాటం లేకుండా రావాలి.మీ పోరాటంలో అడుగులో అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నా అని తెలిపారు.