కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

by Disha Web Desk 13 |
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..
X

దిశ, జనగామ: జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం పెంబర్తి గ్రామంలోని వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్. శివ లింగయ్య శనివారం సాయంత్రం కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లకు పరిశీలించారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున మూడు నియోజకవర్గాలకు 42 టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 6 గంటలకే సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోని 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా.. 10.30 గంటలకు మొదటి రౌండ్ ఫలితాలు రానున్నాయి.


ఇందుకోసం కౌంటింగ్ సిబ్బందికి శుక్రవారం అన్ని రకాలుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రంలో ఫైర్ సేఫ్టీతో పాటు, మీడియా సెల్, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు అంచల భద్రతతో పోలీసులు కట్టుదిట్టం చేశారు. డీసీసీ సీతారాం శనివారం సాయంత్రం పోలీసు అధికారులకు భద్రతకు సంబంధించి తగిన సూచనలు చేశారు.


లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నలుగురికి మించి ఒకచోట గుమి కూడరాదని, అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గానీ, వారి అనుచరులు గానీ టపాసులు కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని పోలీసులు తెలిపారు.

Next Story