మద్యం మత్తులో ఎస్సైపై దాడి..

by Disha Web Desk 23 |
మద్యం మత్తులో ఎస్సైపై దాడి..
X

దిశ,దంతాలపల్లి: దంతాలపల్లి మండల కేంద్రంలో మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. ఖమ్మం -వరంగల్ హైవే రోడ్డు పై ఉన్న బిర్యాని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓనర్ పై యువకుల దాడి చేశారు. ఇది గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే స్పందించిన ఎస్సై కరుణాకర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

యువకులను నిలువరించడానికి ఎస్సై, పోలీసు సిబ్బంది ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న యువకులు ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో దాడికి సైతం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం పెట్రోలింగ్ వాహనాలలో యువకులను తరలిస్తుండగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed