హ‌న్మ‌కొండ డీటీసీ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు

by Aamani |
హ‌న్మ‌కొండ డీటీసీ ఇళ్ల‌ల్లో ఏసీబీ సోదాలు
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : హ‌న్మ‌కొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో శుక్ర‌వారం ఉద‌యం నుంచి ఏసీబీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయ‌నే ఫిర్యాదులు రావ‌డంతో.. హ‌న్మ‌కొండ‌లోని శ్రీనివాస్ ఇంటితో పాటు హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వ‌హిస్తున్నారు. నాలుగు టీంలు సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story