రాయపర్తి మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్​

by Sridhar Babu |
రాయపర్తి మండలంలో బీఆర్ఎస్ కు భారీ షాక్​
X

దిశ, వర్థన్నపేట : రాయపర్తి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. మండలంలో మంచి పట్టున్న బిల్లా సుదీర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునోనున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్న ఆయన గతంలో రాయపర్తి సోసైటీ చైర్మన్ గా పనిచేశారు. అనూహ్య పరిణామాల వల్ల నియోజకవర్గంలో సరైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తమకు ఉన్నతమైన పదవి ఆశ చూపి పార్టీ లో చేర్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అనుకున్న స్థాయిలో పదవితో పాటు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా తనను వాడుకున్నట్లు సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో బిల్లా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆయనకు చుట్టు పక్కల మండలాల్లో స్థానిక ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి పార్టీని వీడటం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఎర్రబెల్లి విజయం వెనుక సుధీర్ రెడ్డి హస్తం ఉందని పలువురు బాహాటంగానే గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మండలంలో సుధీర్ రెడ్డి అనేలా పేరు తెచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బిల్లా ప్రతిపక్షంలో ఉండి దయాకర్ రావు కు ముచ్చెమటలు పట్టించిన నేతగా పేరుంది. మండలంలో ఎర్రబెల్లి ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే ముందుగా బిల్లా ఇంటికి పోలీసులను పంపించి గృహ నిర్బంధం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నట్లు మండలం ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి తో పాటు కొంత మంది మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకోనునట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ను వీడనున్న ముఖ్య నాయకులు

సుధీర్ రెడ్డి తో పాటు మండలంలో సుధీర్ఘ కాలంగా తెలంగాణ ఉద్యమం లో కీలకంగా పనిచేసిన ఎండీ. నయీమ్ తో పాటు మండల రైతుబంధు సమితి అధ్యక్షులుగా పని చేసిన ఆకుల సురేందర్ రావు తో పాటు పలువు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీని వీడనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు టీడీపీలో ఉన్నప్పటి నుండి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆకుల సురేందర్ రావు పార్టీని వీడటం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టమని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.

రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న సుధీర్ రెడ్డి

బిల్లా సుధీర్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రేపు గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆ తర్వాత మండలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి 5000 మందిని వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించేలా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. దీంతో మండలంలో తమ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి.

Advertisement
Next Story