నిద్రా వ్యవస్థలో నిఘా నేత్రాలు..రెచ్చిపోతున్న దొంగలు ముఠా

by Aamani |
నిద్రా వ్యవస్థలో నిఘా నేత్రాలు..రెచ్చిపోతున్న దొంగలు ముఠా
X

దిశ,తొర్రూరు : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలైన ప్పటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ లో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఆర్టీసీ బస్టాండ్లలో దొంగలున్నారు జాగ్రత్త అనే సూచనలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ ఆర్టీసీ బస్టాండ్ లో మంగళవారం ఉదయం రెండు సెల్ ఫోన్లు చోరీకి పాలయ్యాయి.బస్టాండులో వరంగల్ ఫ్లాట్ ఫాం వద్ద బస్సు ఎక్కడానికి వెళ్లే సమయంలో నెల్లికుదురుకు చెందిన పులి రామచంధ్రు,మరొక వ్యక్తి దగ్గర రెండు సెల్ ఫోన్లు తెలియకుండా కేటుగాళ్లు కోటేశారు.అదేవిధంగా తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లక్జరి బస్సులో తొర్రూరు నుంచి ఉప్పల్ కి వెళ్ళగానే దొంగలు 6 సెల్ ఫోన్లు కొట్టేశారు.కానీ దొంగతనాలు జరగకుండా చూసుకోవాల్సిన నిఘా నేత్రాలు మాత్రం నిద్రపోతున్నాయి. తొర్రూర్ ఆర్టీసీ బస్టాండ్ లో వరుసగా సెల్ ఫోన్ ల దొంగతనాలు జరుగుతున్న అధికారులు చలించడం లేదు.గత వారం రోజులలో 8 సెల్ ఫోన్స్ దొంగతనాలు జరిగాయి.దీనికి కారణం సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల షాపులకు కిరాయిలు భారీగా వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ... సీసీ కెమెరాలు అమర్చడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు వెనకడగేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ లో నిఘా నేత్రాలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

నిర్వహణ సరిగా చేయడం లేదు : కె.జగదీష్ తొర్రూరు ఎస్సై

తొర్రూర్ బస్టాండ్ లో సీసీ కెమెరాలు నిర్వహణలో డిపో డీఎంకు చాలాసార్లు మేము వివరణ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చాలా రోజులు అవుతున్నాయి. కావున దీని పరంగా సర్వీసింగ్ చేసే విధంగా చూడాలని డిపో డీఎంకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది.

సీసీ కెమెరాలు పోలీసుల బాధ్యత : పద్మావతి, డిపో మేనేజర్, తొర్రూరు

తొర్రూర్ ఆర్టీసీ బస్టాండ్ లో సెల్ ఫోన్ ల దొంగతనాలు జరుగుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. కానీ ఆర్టీసీ బస్టాండ్ లో అమర్చిన సీసీ కెమెరాలు పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే ఉన్నాయి. వాటి గురించి మాకు ఎటువంటి సమాచారం గానీ లేదు. సీసీ కెమెరాలు రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో అవుతుంది. ఈ విషయంపై మేము కూడా స్పందించి చర్యలు తీసుకుంటాము.

Next Story

Most Viewed