వరంగల్ 7వ డివిజన్ కమిటీ ఎన్నికలు ప్రశాంతం

దిశ, కాళోజి జంక్షన్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 7వ డివిజన్‌లో బుధవారం డివిజన్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి జనార్ధన్ గౌడ్ పాల్గొని డివిజన్ అధ్యక్షుడిగా కొండ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షునిగా గదశి శ్రీను, సాంబరాజు, బీ.వేణు, ఓ.వీరు, ఆర్గ నైజర్ సెక్రటరీ రావుల రాజు, శ్రీరాం సుదర్శన్, కే.శ్రీనివాస్, ఏ.శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. మహిళ అధ్యక్షురాలిగా నాయిని సరస్వతి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.