రిజర్వేషన్లు కావాలి కానీ అంబేద్కర్ వద్దా? వీహెచ్ సంచలన కామెంట్స్

by Disha Web Desk |
రిజర్వేషన్లు కావాలి కానీ అంబేద్కర్ వద్దా? వీహెచ్ సంచలన కామెంట్స్
X

దిశ,డైనమిక్ బ్యూరో: అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ రిజర్వేషన్ కావాలని అంటారు. కానీ అంబేద్కర్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోరని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వీహెచ్ మాట్లాడుతూ.. పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం ఇష్యుపై స్పందించారు. 2019లో పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు కూలగొట్టారని అది కూడా దాన కిషోర్ అనే ఎస్సీ అధికారి ఆధ్వర్యంలో జరిగిందన్నారు. ఆ సమయంలో తాను అమలాపురం నుంచి రూ.5 లక్షల వ్యయంతో అంబేద్కర్ విగ్రహాన్ని తెప్పిస్తే దానిని గోషామహల్ పోలీస్ స్టేషన్2లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటే తప్పేందని ప్రశ్నించిన ఆయన.. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం వద్దని రాజశేఖర్ రెడ్డి చెప్పారా అని నిలదీశారు. కాగా పంజాగుట్టలో విగ్రహ ఏర్పాటు విషయంలో 2019 నుంచి వివాదం కొనసాగుతోంది. అనుమతి లేకుండా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారని ఆ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తరలించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై దళిత, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.



Next Story