వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకూ ‘నో శాలరీ’.. మరో వారం పాటు కష్టమే..!

by Satheesh |
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకూ ‘నో శాలరీ’.. మరో వారం పాటు కష్టమే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, విధాన పరిషత్ విభాగంలో పనిచేసే డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌కు ఇప్పటి వరకు జీతాలు రాలేదని ఉద్యోగులు చెప్తున్నారు. టీవీవీపీ పరిధిలో రెగ్యులర్‌తో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిపి సుమారు 12 వేల మంది పనిచేస్తున్నరని, ఇప్పటి వరకు తమకు జీతాలు రాలేదని ఆయా సంఘాలు శుక్రవారం తెలిపాయి. వైద్యారోగ్య శాఖ పరిధిలోని ఇతర విభాగాల ఉద్యోగులకు నెల ప్రారంభంలోనే ప్రభుత్వం వేతనాలు ఇచ్చిందని, కానీ టీవీవీపీ పరిధిలోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అందలేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని, అయినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే వేతనాలు అందేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు వరుసగా సెలవుల నేపథ్యంలో వేతనాలు పడటానికి కనీసం మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నదని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.



Next Story

Most Viewed