- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిర్యానీలో ఉడికిన జెర్రీ.. ఉలిక్కిపడ్డ కస్టమర్!
దిశ, డైనమిక్ బ్యూరో: నాన్‌వెజ్ ప్రియులకు బిర్యానీ అంటే ఒక ఎమోషన్.. అలాంటి వారికి అప్పుడప్పుడు కొన్ని రెస్టారెంట్‌లు షాక్ ఇస్తుంటాయి. అప్పుడప్పుడు బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు అందులో బొద్దింకలు, పురుగులు, జెర్రులు దర్శనమివ్వడం తరుచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ హోటల్ లో కూడా ఇలాంటి ఘటననే బిర్యానీ లవర్స్‌ను ఉలిక్కిపడేలా చేసింది. భువనగిరి శివారులోని హోటల్ వివేరలో ఓ కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో జెర్రీ ప్రత్యక్షమైంది.
దీంతో ఉడికిన జెర్రీని చూసిన కస్టమర్ ఉలిక్కిపడి.. హోటల్ సిబ్బందికి జెర్రీని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. పెద్ద హోటల్స్ కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నెటిజన్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంటుకు ఫిర్యాదు చేశారు.