సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |   ( Updated:2024-09-15 13:26:35.0  )
సీనియర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి : వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) నూతన పీసీసీ(PCC) అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నేడు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు.. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించారు. పార్టీలో కొత్త తరాన్ని ఆహ్వానిస్తున్నాని చెప్పిన వీహెచ్(VH).. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కోరారు. కొత్తతరం నాయకులు పాతతరం నాయకులంతా కలిసి పనిచేస్తేనే పార్టీకి మంచిదని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అనేకమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు నమోదు చేశారని, వాటన్నింటినీ తక్షణమే ఎత్తివేయాలని అన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా వీహెచ్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.


Advertisement

Next Story