Raj Bhavan లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎందుకు? Governor పై మంత్రి వేముల ఫైర్

by Disha Web Desk 4 |
Raj Bhavan లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎందుకు? Governor పై మంత్రి వేముల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ తమిళిసైపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయం మర్చిపోయిందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసీఆర్‌ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తారు? అంటూ వేముల ప్రశ్నించారు. మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారని, పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్‌భవన్‌లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎలా పెడతారు? అంటూ నిలదీశారు.

గవర్నర్ అధికార పర్యటనలు ప్రభుత్వానికి, అధికారుల కంటే ముందే బీజేపీ వాళ్లకు ఎలా తెలుస్తుంది? దీని వెనుక ఉన్న మతలబు ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమన్నా అంటే ఈడీ, సీబీఐ కేసులు పెడతామంటుని బెదిరిస్తున్నారు. మోడీలకు, ఈడీలకు కేసీఆర్ భయపడడు...దేనికైనా సిద్ధమే! అని సవాల్‌ చేశారు. ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టు.. నీ ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతరెయ్యి అన్న కాళోజీ మాటలు బీజేపీకి వర్తిస్తాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని కూడా అదానీ, అంబానీలకు దారాదత్తం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర చేస్తున్నారన్నారని వేముల ఆరోపించారు.

Also Read: కేసీఆర్ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్



Next Story

Most Viewed