Uppuguda: రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో మంటలు.. ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం

by Ramesh Goud |
Uppuguda: రన్నింగ్‌లో ఉన్న స్కూటీలో మంటలు.. ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: రన్నింగ్ లో ఉన్న స్కూటీ(Scooty)లో మంటలు చెలరేగిన ఘటన ఉప్పుగూడ(Uppuguda) సమీపంలో జరిగింది. పాదాలకంటి లక్ష్మణ్(Padalakanti laxman) అనే వ్యక్తి జీహెచ్ఎంసీ(GHMC)లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో.. ఉప్పుగూడ రైల్వే బ్రిడ్జ్ క్రింద రాగానే, బండిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికుడు స్కూటీని వదిలి పరుగులు తీశాడు. దీంతో ప్రమాదం తప్పినట్లు అయ్యింది. స్థానికులు వచ్చి మంటలను అర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే మంటలకు బండి పూర్తిగా దగ్ధం అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed