పాక్, సిరియా పరిస్థితి మనకు రావొద్దంటే.. హిందూ సమాజాన్ని చైతన్యం చేయాలి: కిషన్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-10-03 12:42:17.0  )
పాక్, సిరియా పరిస్థితి మనకు రావొద్దంటే.. హిందూ సమాజాన్ని చైతన్యం చేయాలి: కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న రోజుల్లో మనమంతా హిందువులం.. దేశ బంధువులం అనే విధంగా ఐక్యంగా ఉండాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఖైరతాబాద్​గణేశ్‌ను దర్శించుకున్న సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ.. పాక్, సిరియా లాంటి దేశాల పరిస్థితులు, మన దేశంలో రాకూడదంటే ఉండాలంటే.. హిందువులం అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో మన హిందూ సమాజాన్ని దెబ్బతీసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో వినాయకుడి ఉత్సవాలు కారణంగా హిందువులలో ఐక్యత వచ్చిందన్నారు. ఎప్పుడైతే భారత దేశంలో హిందువులు మెజార్టీ గా ఉంటారో.. అప్పుడు ఈ దేశం సెక్యులరిజం, శాంతి ఉంటుందన్నారు. మైనార్టీలుగా మారితే.. దేశంలో సెక్యులరిజం ఉండదు, శాంతి ఉండదని, ప్రజలు సమస్యల పరిష్కారం కుదరదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story