బీజేపీతో ఏం ప్రమాదం లేదు.. ఉన్నదల్లా కాంగ్రెస్‌తోనే: కిషన్ రెడ్డి

by GSrikanth |
బీజేపీతో ఏం ప్రమాదం లేదు.. ఉన్నదల్లా కాంగ్రెస్‌తోనే: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశమంతటా తిరిగినా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించకపోవడం వల్లే నిరాశలో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యంపై విపరీత భాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. సోమవారం పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. దేశంలో నియంత పాలన ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించి అణచివేసిందని ఆరోపించారు.

Next Story