- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారత ప్రధాని మోడీ (Prime Minister Modi) కన్వర్టెడ్ బీసీ (Converted BC) అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ (Hot topic)గా మారిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన రాహుల్ గాంధీ కులం (Rahul Gandhi caste), మతంపై బీజేపీ నేతలు (BJP leaders) ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు (Congress leaders) స్పందిస్తూ.. ఎవరికైన తండ్రి కులం, మతం వస్తుందని, రాహుల్ గాంధీది కూడా వారి తండ్రి కులం అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో కులం, మతం, జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయన తల్లి సోనియా గాంధీ ఓ క్రిస్టియన్ (Christian) అని, రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ (Rahul Gandhi's grandfather was Feroze Khan Gandhi) అని, రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే లెక్క ప్రకారం రాహుల్ గాంధీ కూడా ముస్లిం (Rahul Gandhi is also a Muslim) అవుతాడని దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించి సమాధానం చెప్పాలని బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు.
అలాగే లవ్ జిహాదీ, మతమార్పిడులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోను చట్టం రావాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హిందూ బీసీ (Hindu BC)లకు 42 శాతం ఇస్తే కేంద్ర సహకరిస్తుందని, మమ్మల్ని మతతత్వ వాదులు అన్న పర్వాలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని.. కన్వర్టెడ్ అని అన్నారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోడీ ఉండేవాళ్లని.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోడీ కులం(Modi Caste) గురించి ఆషామాషీగా చెప్పడం లేదు.. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని అన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.