దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత అవినీతి సర్కార్: కేంద్రమంత్రి అమిత్ షా ఫైర్

by Satheesh |
దేశంలోనే బీఆర్ఎస్ అత్యంత అవినీతి సర్కార్: కేంద్రమంత్రి అమిత్ షా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుత జనగాం ఎమ్మెల్యే భూ కుంభకోణాల్లో ఉన్నారని, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జనగాంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ఓవైసీకి భయపడే తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అంతేకాకుండా బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శలు గుప్పించారు. 2జీ పార్టీ అంటే కేసీఆర్, కేటీఆర్ పార్టీ, 3 తరాల నేతల ఎంఐఎం అంటే 3జీ పార్టీ, 4జీ అంటే 4 తరాల నెహ్రూ, ఇందిరా, రాజీవ్, రాహుల్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అని అన్నారు.

Next Story