నాన్నమ్మను చంపిన రెండేళ్ల తర్వాత మనవడికి తగిన శిక్ష

by Disha Web Desk 21 |
నాన్నమ్మను చంపిన రెండేళ్ల తర్వాత మనవడికి తగిన శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్ : గత రెండేళ్ల క్రితం అంటే 2020 ఫిబ్రవరిలో నాన్నమ్మను అతి కిరాతకంగా కొట్టి చంపిన హత్య కేసులో మనవడికి కోలుకోలేని శిక్ష విధించింది కోర్టు. భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కొమిరె లక్ష్మికి ముగ్గురు కుమారులు. వారిలో చివరి కుమారుడు భూమన్న మృతి చెందడంతో అతని కొడుకు గంగాధర్‌ని అల్లారు ముద్దుగా పెంచేది నాన్నమ్మ. ఇక తల్లిదండ్రులు లేని పిల్లలపై చూపించే ప్రేమానురాగాలు, కేరింగ్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గంగాధర్‌ చెడు వ్యసనాలకు బానిసై రోజు ఇంటికి తాగొచ్చేవాడు. దీంతో నాన్నమ్మ ఎన్ని మంచి బుద్దులు చెప్పి మందలించినా.. పట్టించుకునే వాడు కాదు. అంతకంతకు గంగాధర్ తాగుడు పీక్స్‌కి చేరుకుంది.

ఇక రోజూలానే గంగాధర్ ఒకరోజు ఫుల్ గా తాగి ఇంటికొచ్చాడు. సహించలేని నాన్నమ్మ అతడిని నిలదీసి గొడవ పడింది. ఇక మద్యం మత్తులో పీక్స్‌కు చేరుకున్న గంగాధర్.. నిద్రపోతున్న నాన్నమ్మపై కర్రలు, ఇటుకలతో అతి కిరాతకంగా కొట్టి చంపాడు. దీంతో అతడిపై గతంలోనే హత్యకేసు నమోదు చేశారు పోలీసులు. గంగాధర్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో నాన్నమ్మ హత్య కేసులో మనవడు గంగాధరే నేరస్థుడని రుజువు అయింది. ఈ మేరకు నేరస్థుడికి కోలుకోలేని శిక్ష విధించింది కోర్టు. నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల.. పెద్దలు చెప్పిన మంచి మాటలను వినకపోవడమే కాకుండా, వారినే హత్య చేయడం క్షమించరాని నేరంగా పరిగణించింది. గంగాధర్‌కు జీవిత కారగార శిక్షతో పాటు రూ. 2వేలు జరిమానా విధించి తీర్పు వెల్లడించారు.


Next Story