MLC పోలింగ్ వేళ కలకలం.. మరో రెండు సెల్ టవర్స్ తగలబెట్టిన మావోయిస్టులు

by Rajesh |
MLC పోలింగ్ వేళ కలకలం.. మరో రెండు సెల్ టవర్స్ తగలబెట్టిన మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ నారాయణ్ పూర్ జిల్లా చోటే‌డోన్‌గార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చమేలి మరియు గౌర్ దండ గ్రామాల్లో రెండు మొబైల్ సెల్ టవర్‌లను మావోయిస్టులు తగలపెట్టారు. ఆదివారం బంద్ సందర్బంగా బీజాపూర్ జిల్లాలో రెండు సెల్ టవర్స్ తగలపెట్టగా, సోమవారం నారాయణపూర్ జిల్లాలో మరోరెండు టవర్స్ తగల పెట్టడంతో ఆ ప్రాంతాలలో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. సంఘటన ప్రాంతంలో బూటకపు ఎన్‌కౌంటర్‌లకు నిరసనగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టారు.

Next Story

Most Viewed