తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్​అధికారులు బదిలీ

by GSrikanth |
తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్​అధికారులు బదిలీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇద్దరు ఐపీఎస్​అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్​అడిషనల్​కమిషనర్​(క్రైమ్స్)గా ఉన్న ఏవీ రంగనాథ్‌ను మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ఇక, హైదరాబాద్​సెంట్రల్​జోన్​డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను యాంటీ నార్కొటిక్​బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో రాష్ర్టంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్​అధికారుల ట్రాన్స్‌ఫర్లు జరుగనున్నట్టు సమాచారం. పార్లమెంట్​ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు జరుగనున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

Next Story

Most Viewed