‘మిషన్​భగీరథ’ పేర బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్

by Mahesh |
‘మిషన్​భగీరథ’ పేర బ్యాంకును మోసం చేసిన ఇద్దరు అరెస్ట్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: మిషన్​భగీరథ ప్రాజెక్ట్​పనుల కోసమంటూ బ్యాంకు నుంచి కోటీ 30 లక్షల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తిని సైబరాబాద్​ఎకనామిక్​అఫెన్సెస్​వింగ్​అధికారులు అరెస్ట్​చేశారు. అతనికి సహకరించిన బ్యాంక్​మాజీ ఛీఫ్​మేనేజర్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. ఎకనామిక్​అఫెన్సెస్​వింగ్​డీసీపీ కే.ప్రసాద్​తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామాంతాపూర్​నివాసి మహ్మద్​ఫయాజ్​అహమద్, మహ్మద్​చాంద్​పాషాలు ఏఎఫ్ఎస్​కన్​స్ర్టక్షన్స్​కంపెనీ ప్రైవేట్​లిమిటెడ్​కంపెనీ డైరెక్టర్లు. ఇదిలా ఉండగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చే కాంట్రాక్ట్​పొందిన ఈ ఇద్దరు పనులు ప్రారంభించారు కూడా.

అయితే, ఈ పనులను అడ్డం పెట్టుకుని బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగ్గొట్టాలని పథకం వేసుకున్న ఈ ఇద్దరు కెనరా బ్యాంక్​బాలానగర్​బ్రాంచుకు అప్పట్లో ఛీఫ్​మేనేజర్​గా ఉన జీ.శ్రీనివాస్​బాబును కలిశారు. తమకు సహకరించి రుణం మంజూరు చేస్తే భారీ మొత్తంలో కమీషన్​ఇస్తామన్నారు. దీనికి శ్రీనివాస్​బాబు అంగీకరించాడు. ఈ క్రమంలో మహ్మద్​ఫయాజ్​అహమద్, మహ్మద్​చాంద్​పాషాలు ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించి బ్యాంకు నుంచి కోట 30లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఆ తరువాత రుణాన్ని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు. ఈ మేరకు బ్యాంక్​అధికారుల నుంచి ఫిర్యాదు అందగా సైబరాబాద్​కమిషనరేట్​ఎకనామిక్​అఫెన్సెస్​వింగ్​ఏసీపీ ఎం.హుస్సేనీ నాయుడు ఐపీసీ 406, 409, 420, 467, 468, 471 రెడ్​విత్​120బీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్​ఫయాజ్​అహమద్, శ్రీనివాస్​బాబును అరెస్ట్​చేశారు. పరారీలో ఉన్న మహ్మద్​చాంద్​పాషా కోసం గాలిస్తున్నారు.



Next Story

Most Viewed