హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లే వారికి TSRTC గుడ్ న్యూస్

by Disha Web Desk 4 |
హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లే వారికి TSRTC గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవుల వేళ టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీని టీఎస్ ఆర్టీసీ కల్పించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హై ఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని.. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక ఈ రూట్‌లో మొత్తం 26 బస్సుల్లో ఈ బుకింగ్ సౌకర్యం ఉందని ఆర్టీసీ తెలిపింది.

CLICK HERE FOR TWITTER VIDEO

Next Story

Most Viewed