టీఎస్‌పీఎస్సీ సైట్‌ను వెంటనే నిలిపివేయాలి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత లేఖ

by Disha Web Desk 13 |
టీఎస్‌పీఎస్సీ సైట్‌ను వెంటనే నిలిపివేయాలి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ సైట్‌ను వెంటనే నిలిపివేయాలని, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు సర్వర్లు సీజ్ చేసి పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్​లీడర్​బక్క జడ్సన్ పేర్కొన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్​ లీకేజీ పై సమగ్ర విచారణ జరగాలంటే సిట్​తో సాధ్యం కాదని, వెంటనే సీబీఐకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని జడ్సన్​ గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. డాక్టర్​బి. జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత కమిషన్ అధికార రాష్ట్ర పార్టీకి వత్తాసు పలుకుతూ.. ముందుకు సాగుతుందన్నారు.

దీంతో టీఎస్పీఎస్సీ ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి, కుంభకోణం దోషులు తేలే వరకు టీఎస్​పీఎస్సీ ని దర్యాప్తు సంస్థలు కంట్రోల్​లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని గవర్నర్​లేఖలో పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ప్రభుత్వంలో అంతా అవినీతి మయం అయిందన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, పేదలను పొట్ట కొట్టే పనులన్నీంటిని బీఆర్​ఎస్​ సర్కార్​చేస్తోందని ఆరోపించారు.

Next Story